నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మే 25:
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జూన్ లోనే ఖరారు కానున్నాయి. సర్పంచ్ పదవి కాలం అయిపోయి దాదాపు అయిదు నెలలు అవుతుండడంతో ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించల్సి ఉంది.కాబట్టి జూలై మొదటి వారం లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈ ఎన్నికలను పెండింగ్ పెట్టాలనుకున్న,హై కోర్టు ఈ విషయం పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.జూన్ 4 న వెలువడే ఫలితాల అనంతరం స్థానిక సంస్థల నోటిఫికేషన్ రానున్నది.ప్రభుత్వం ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికల గురించి అధికారికంగా ప్రకటించ లేదు.ఈ ఎన్నికల గురించి ఇటీవల వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు.
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్పంచ్ పదవి కాలం 5నెలలు ఐపోతున్న ఏటువంటి రిజర్వేషన్ లకు ప్రణాళిక రూపొందించలేదు.ఇంక ఎన్నికలకు నెల రోజులే గడువు ఉండటంతో పాత రిజర్వేషన్ లే కొనసాగుతాయా అనేది ప్రశ్నార్థకమేనా వేచి చూడాల్సిందే.