◆శభాష్ కానిస్టేబుల్ శ్రీనివాస్..
◆సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఏ. ఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్.
◆హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడి ఆ కుటుంబం పాలిట దేవుడయ్యిండు.
◆సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నేటి గద్ధర్ న్యూస్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా :
శుక్రవారం రోజున సాయంత్రం హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన ఓ మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో గడ్డమిది శ్రీనివాస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు .తండ్రి శంకర్ మరణ వార్త విని గుండె పోటుకు గురై కుప్పకూలిన సిరిసిల్ల పట్టణం గాంధీనగర్ కు చెందినా చిలగాని అనూహ్య అనే మహిళా ఇంట్లో నుండి కేకలు వినబడడంతో వెంటనే స్పందించి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి ఆమెకు సీపీఆర్ చేసినారు.అక్కడే రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్లు గమనించేలోపే, అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు..ఆమెకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తన సొంత వాహనంలో తరలించారు.కానిస్టేబుల్ చాకచక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.ప్రస్తుతం ఆమెకు తారక రామారావు హాస్పటల్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు .హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టిందనే చెప్పాలి. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఈ సందర్బంగా పలువురు నెటిజన్లు అభినందనలు తెలిపారు.