నేటి గద్దర్ న్యూస్,జూలూరుపాడు:
మండల పరిధిలోని మాచినేనిపట గ్రామంలో నకిలీ విత్తనాల పై మండల వ్యవసాయ అధికారి ఎస్. రఘు దీపిక ఆధ్వర్యంలో రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుడ్డ సంచులలో అమ్మే విత్తనాలు కొనకూడదని, కొని మోసపోవద్దని ఊర్ల లోకి వచ్చి ఎవరైనా ప్యాకెట్లు అమ్మితే తమకు కంప్లైంట్ ఇవ్వాలని అని అన్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలనీ, కొనుగోలు చేసిన విత్తనాలకి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, పంట కాలం వరకు రసీదు మరియు ప్యాకెట్లు ఉంచుకోవాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో
జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబు రావు కొత్తగూడెం సహాయ సంచాలకులు శ్రీ దండ రమేష్
మాచినేనిపేట AEO B. గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 64