+91 95819 05907

వరంగల్- ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో ఓటర్లు ఓటు వేయడం ఎలా ?

నేటి గదర్, మే 25, ములుగు ప్రతినిధి:

వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి వివరంగా తెలియజేశారు. @ ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వాయిలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలి. @ ఓటరు ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2,లేదా 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో పేర్కొనాల్సి @ మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1 వ అంకెను, ఒక అభ్యర్థి కి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయవలసి ఉంటుందని
@ ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1,2,3, వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. @ ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా భారతీయ సంఖ్యలైన 1,2,3, మార్క్ చేయాలి. ఓటర్లు ఓటు వేసేటప్పుడు చేయకూడని అంశాలు
@ బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు 1 వ సంఖ్య ఇవ్వకూడదు.
@ బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడం, లేదా ఇనిషియల్ వేయటం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదు .
@ ఓటరు బ్యాలెట్ పేపర్ పై 1,2,3,4,5 సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని,
@ ఓటరు బ్యాలెట్ పేపర్ పై పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని ప్రాధాన్యత రాయకూడదు.

@. అలాగే బ్యాలెట్ పేపర్ పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటు మార్కు పెట్టడం వంటివి సైతం చేయకూడదు.

@ ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1,2 సంఖ్యలు వేయకూడదు .

@ బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో మాత్రమే 1,2,3, అంకెలు వేయాలి. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వర్తించేలా నంబర్ మార్కు చేయకూడదు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !