మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:
భద్రాచలం పట్టణంలోని మారుతి పారామెడికల్ నర్సింగ్ కళాశాలలో జరిగిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతి పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని,బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,నర్సింగ్ కళాశాల
లో జరిగిన సంఘటన దారుణమన్నారు.విద్యార్ధి కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.భద్రాచలం పట్టణంలో ఉన్న మారుతి
నర్సింగ్ కాలేజీలో విద్యార్థి మృతి సంఘటన అత్యంత దారుణమన్నారు.విద్యార్థి పగిడిపల్లి కారుణ్య బాత్రూంలో జారి పడి విద్యార్థి మరణించిందని,యాజమాన్యం చెప్పటం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్నారు.సీసీ కెమెరాలో మాత్రం బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయినట్లు ఉందని పేర్కొన్నారు.కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థిని మరణాన్ని లెక్క లేని విధంగా వ్యవహరించి మాట్లాడటం దుర్మార్గమన్నారు.విద్యార్థిని మరణానికి కారణమైన నర్సింగ్ కళాశాలను తక్షణమే సంబంధిత అధికారులు సీజ్ చేయాలని, బాధిత విద్యార్థినీ కుటుంబానికి తగు న్యాయం చేయాలన్నారు. విద్యార్థి కారుణ్య మరణంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని,కాలేజీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో అన్ని సంఘాల నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.