ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి:
గుడిపూడి కోటేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:
నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు నల్లేరు మీద నడకే అని ఎంపిటిసి ల ఫోరమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి ఆర్ యస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఒక్కడే గెలిచి సాధించేది ఏమి లేదని,రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేధావులైన పట్టభద్రులారా ఆలోచించి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు.
Post Views: 118