నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి బ్యాలెట్ పేపర్లోని 2వ నెంబర్ క్రమసంఖ్యలో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన చర్ల జడ్పీటీసీ ఇర్ప శాంత. ఆమె మాట్లాడుతూ గతంలో రెండు సార్లు గెలిచిన BRS పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిగారు కనీసం ఒక్కసారి కూడా చట్ట సభల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడిన సందర్బం లేదు,అదేవిధంగా పట్టభద్రుల ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రుల ఓట్లతో గెలిచి MLA పదవి కోసం రాజీనామా చెయ్యడం వల్లే ఈ ఉప ఎన్నిక జరుగుతుంది అని తెలిపారు.. కావున విజ్ఞానవంతులైన పట్టభద్రులారా!ఈ ఒక్కసారి ఆలోచించి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని చర్ల జడ్పీటీసీ ఇర్ప శాంత కోరారు .