గొండ్వాన సంక్షేమ పరిషత్ చర్ల మండల కార్య నిర్వహణ అధ్యక్షులు పూనెం వరప్రసాద్
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
బుధవారం నాడు చర్ల మండల కేంద్రంలో సోడి అనిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో జి ఎ స్పి చర్ల మండల కార్య నిర్వహణ అధ్యక్షులు పూనెం వరప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ.గతంలో మంజూరు అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తక్షణమే నిర్మించాలి చర్ల మండల కేంద్రలో డిగ్రీ కళాశాల లేకపోవడం వలన అనేక మంది ఆదివాసీ యువతీ యువకులు విద్య నూ కోల్పోతున్నారు ప్రవేట్ కళాశాల పీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు అందుకనే గతంలో మంజురుయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తక్షణమే నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే చుట్టూ ప్రక్కల ఉన్న ఏజెన్సీ గ్రామాలలో ఉన్న ఆదివాసీ యువతీ యువకులకు ఎంతో ఉపయోగం అవుతుంది అని తెలియజేచారు ఈ కార్యక్రమంలో చర్ల మండల ప్రధాన కార్యదర్శి ఇర్ప సారయ్య పూనెం రవికిరణ్ వాడే నాగబాబు సతీష్ పూనెం వెంకటేష్. చందు ఇర్ప అరుణ్ రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు