నేటి గదర్,మే 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
కూసుమంచి రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ విజయ కుమారి రైతులకు పలు సూచనలు చేశారు .. మార్కెట్ ఇంటలిజెన్స్ పంట ఉత్పత్తులకు వచ్చేటువంటి రేటును ముందుగా అంచనా వేయడం తదనగుణంగా మార్కెట్ ప్రైస్ గురించి వివరించారు. మార్కెట్ రేట్ అంచనాలను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. పత్తి రకాలు ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పత్తిలో చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. పత్తిలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం పడకుండా రైతులు పత్తి పంట విత్తరాదని సూచించారు . అనంతరం డాక్టర్ లీల కుమారి మాట్లాడారు.. రైతులకు ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు ,రాబోయే వాన కాలంలో ఋతుపవనాల రాక గురించి తెలుసుకుంటూ పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ అనుకూలంగా వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్ర రైతులు పాల్గొన్నారు.