అవార్డును ప్రదానం చేసిన “ఐ” ఫౌండేషన్..
సామాజిక సేవలో గుర్తింపుగా పురస్కారం ..
నేటి గదర్, మే 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
సామాజిక సేవలో విశేషమైన కృషి చేసినందుకు గాను కూసుమంచి మండలం గోరిలపాడు తండ గ్రామ శివారు ప్రాంతమైన చాంప్లతండ వాసి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కు జాతీయ స్వచ్ఛంద సంస్థ “ఐ” ఫౌండేషన్ తరపునా ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం పీటర్ నాయక్ లకావత్ ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ట్రస్ట్ చైర్మన్ గా వివిధ సామాజిక సేవలు అందిస్తూ అనేక మంది నుండి ప్రశంశలు అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన నేటి గదర్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజిక సేవలో పూర్తి నిబద్ధతతో పని చేస్తూ వెళ్తున్న నాకు నా సేవలను గుర్తించి ఐ ఫౌండేషన్ 2021లో ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డుకు నామినేట్ చేశారు .సేవలకు గుర్తిస్తూ ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డు ను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అలాగే ప్రశంస పత్రం కూడా అందజేసారని తెలిపారు. ఇలాంటి అవార్డు లు రావడం పట్ల సంతోషాన్ని కలిగించడమే మరింత బలం, ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.. రాబోయే రోజుల్లో కూడా తన సేవలను కొనసాగిస్తానని.. పేదలకు సహాయంగా ఉండేందుకు నిత్యం కృషి చేస్తానని అన్నారు. అవార్డు అందుకున్న తరువాత తనకు విషెష్ చెప్పి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.