★హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్తుండగా ఘటన
★ఆటో లో 5 గురు ప్రయాణీకులు
*ఓ మహిళ అక్కడికక్కడే మృతి.మిగిలిన నలుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు
నేటి గదర్ న్యూస్ , ములుగు జిల్లా ప్రతినిధి, (మే 29):దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన భక్తులు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించడానికి మేడారం రావడం జరుగుతుంది. ఇంకా కొద్ది సమయంలో అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు .ఈ లోపే వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆటోలో ఐదు రూపాయలు ఒక మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మరో నలుగురు తీవ్ర గాయాల పాలు కాగా వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 383