నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 29:
మణుగూరు మండల పరిధిలోని పీవీ కాలనీ క్రాస్ రోడ్ హనుమాన్ గుడిలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీఅభయాంజనేయ స్వామికి లక్ష తమలపాకులతో అర్చన కార్యక్రమం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా హనుమాన్ భక్తులు సార్లు హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించడం జరుగుతుందని అన్నారు.జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 108 లీటర్ల పాలతో హనుమంతుడికి పాలాభిషేకం,లక్ష తమలపాకుల తమలపాకుల అర్చన పూజ కార్యక్రమాలు ఉంటుందని అలాగే అనంతరం శాంతి హోమం తదనంతరం అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులందరూ సకాలంలో హాజరై హనుమాన్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.
Post Views: 68