+91 95819 05907

ఇసుక లారీ పంచాయతీ కార్మికుని ప్రాణం తీసింది

★ ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొట్టిన ఇసుక లారీ – స్పాట్లో చనిపోయిన జీపీ కార్మికుడు సారయ్య
★ మరో ముగ్గురు కార్మికులకు తప్పిన ముప్పు

నేటి గదర్ న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, ( మే 29):

గ్రామపంచాయతీ కార్మికులు చెత్త సేకరిస్తుండగా ట్రాక్టర్ ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో కార్మికుడు స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికు లు, జీపీ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు లోని ఎస్సీ కాలనీకి చెందిన బల్గూరి సారయ్య (52) గతంలో హమాలీ కార్మికునిగా పట్టణ వాసులకు సుపరిచితుడు. గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా కొన్నేళ్ల క్రితం నుంచి పనిచేస్తున్న సారయ్య మంగళవారం సాయంత్రం చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తూ మరో ముగ్గురు కార్మికులు పైడి, రాజేందర్, వెంకన్నలతో కలిసి డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారిపై చెత్త సేకరణ చేస్తున్నారు. ఎన్ హెచ్ పై నాటిన మొక్కల మధ్య పెరిగిన గడ్డిని తొలగించగా దానిని సేకరిస్తుంగా సారయ్య ట్రాక్టర్ ట్రాలీలో ఉండి నేర్పుతున్నాడు. అయితే ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సారయ్య ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే చనిపో యాడు. తోటి కార్మికులు చెత్త సేకరిస్తుండగా తాము సైతం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని తెలిపారు. కాగా, జీపీ అధికారులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుడు సారయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండ గా అందరికీ వివాహాలయ్యాయి. భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి జీపీ కార్యదర్శి రఘు, కార్మికులు, మాజీ పాలకవర్గం సభ్యులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్మికుని మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !