★మానవత్వం చాటుకున్న కన్నాయిగూడెం మండల్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు , కిసాన్ కాంగ్రేస్ మండల్ అధ్యక్షులు తాటి రాజబాబు.
నేటి గదర్ న్యూస్ , ములుగు జిల్లా ప్రతినిధి(మే 29):
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరు గ్రామంలో గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మారగోని మల్లయ్య (60) మృతి చెందాడు.మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని మండల ఇంచార్జి జాడి రాంబాబు, కిసాన్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు పరామర్శించి ఆర్థిక సహాయం , నిత్యవసర సరుకులు అందజేశారు.మారగోని మల్లయ్య కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మంత్రి సీతక్క తెలియజేసి వారి కుటుంబానికి కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటామని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమం గ్రామ యూత్ నాయకులు,తాటి లచ్చలు, కుమ్మరి అంజిబాబు, తాటి యాదగిరి, కోడూరు బాలు, కోడూరి చంటి,కుమ్మరి దుర్గారావు, రంగారావు, జనగాం వెంకట్, సునార్కని కోటేశ్వరరావు,గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు కుమ్మరి నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.