చెప్పులు అరిగేలా తిరిగిన గిరిజనుడికి దక్కని న్యాయం..!
కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసు ప్రొటెక్షన్ కల్పించమని పోలీస్ కు వేడుకోలు..!
భూ బాధితుడు పోడియం లక్ష్మయ్య.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 29:
గిరిజనులకు గౌరవ కోర్టు వారు పోలీసు ప్రొటెక్షన్ కల్పించని ఉత్తర్వులు ఉన్నప్పటికీ గిరిజనులకు కల్పించకపోగా, గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ, గిరిజనులను రేపు,మాపు అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకుంటూ,పోలీసు నాన్చే ధోరణి అవలంబిస్తూన్నారని,భూ బాధితుడు పోడియం లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆరోపించారు.
వివరాల్లోకి వెళ్తే… అశ్వాపురం మండల పరిధిలోని అశ్వాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో పొడియం లక్ష్మయ్య అనే గిరిజనుడికి చెందిన సర్వే నెంబర్.400/ఇ8 నందు 0.22 గుంటల భూమికి గిరిజనేతరులు అడ్డుపడుతున్నారని మొబైల్ కోర్టు భద్రాచలం వారు గిరిజనులకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు.దానితో పాటు గిరిజనులు స్వేచ్చగా భూమిని అనుభవిచడానికి అడ్డంకులు సృష్టించకుండా పోలీసు ప్రొటెక్షన్ ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు.ఇదే విషయం స్థానిక పోలీస్ వారిని కోర్టు ఉత్తర్వుల ద్వారా పోలీసు ప్రొటెక్షన్ కల్పించమని దరఖాస్తు ద్వారా కోరగా,అడ్డుపడుతున్న గిరిజనేతరులకు ఎటువంటి ఉత్తర్వులు లేకపోయిన కానీ వారికి వత్తాసు పలికేలా స్థానిక పోలీసులు వ్యవహరిస్తున్నారని,
అది సరికాదని గిరిజనుడైన నాకు మొబైల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం న్యాయం చేయాలని బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీసు వారిని వేడుకుంటున్నారు.
పొడియం లక్ష్మయ్య అనే గిరిజన వృద్ధుడికి
న్యాయం జరగకపోతే,ఆదివాసి సేన ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా నిర్వహిస్తామని ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు వజ్జా జ్యోతి బస్ కోరారు.