AO రామడుగు వాణి..
నేటి గదర్,మే 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
మండల పరిధిలోని కూసుమంచి ,పాలేరు , కోక్యాతండా, చౌటపల్లి మొదలగు గ్రామాలలోని విత్తన దుకాణాలను కూసుమంచి మండల వ్యవసాయ అధికారిని రామడుగు వాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తన వ్యాపారులందరూ చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. రైతులకు ఇచ్చే బిల్లు మీద వారి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని లాట్ నెంబర్లను సరి చూడాలని, రైతు వారీగా విత్తన విక్రయాలను రిజిస్టర్ లో పొందుపరచాలని, ఇటువంటి రిజిస్టర్ లను ప్రతిరోజు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు విత్తనాలు అమ్మిన రిపోర్టును సమర్పించాలని, రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఏ డీలర్ అయినా ఎంఆర్పి కన్నా అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం వస్తే విత్తన చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.