+91 95819 05907

పగిడిపల్లి కారుణ్య మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి…

అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో…
PDSU రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మే 29:

భద్రాచలంలో మారుతీ పారా మెడికల్ కళాశాలలో మే 23వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన పగిడిపల్లి కారుణ్య మరణం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుందని,కారుణ్య హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని దీనికి మారుతి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని పి డి యస్ యూ రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్,పి డి యస్ యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా మహాజన సోషలిస్ట్ పార్టీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లత డిమాండ్ చేశారు.భద్రాచలం పట్టణం సీపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో బుధవారం పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతీ పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో గడిచిన 10 యేండ్ల కాలంలో దళిత,ఆదివాసి కుటుంబాలకు చెందిన విద్యార్థినిలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతూ అత్యాచారాలకు గురవుతున్నారని వారు ఆరోపించారు. మారుతి కళాశాలలో గతంలో జరిగిన మరణాల పట్ల కళాశాల సిబ్బంది,యాజమాన్య పాత్ర పై అనేక అనుమానాలు ఉన్నా సమగ్ర విచారణ జరగక పోవడంతో ఈ నిర్లక్ష్యపు కారణాల వల్ల నేడు విద్యార్థిని కారుణ్య మృతికి బలమైన కారణాలు అయ్యాయని వారు తెలిపారు.గతంలో మాదిరిగానే కారుణ్య మృతి రహస్యాలను కూడా బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం తమకు ఉన్న ఆర్థిక,రాజకీయ అంగ బలాన్ని ఆసరాగా చేసుకుని కారుణ్య మృతిని పలు విధాలుగా తప్పు దోవ పట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే భద్రాచలం పట్టణం నడి ఒడ్డున మా బిడ్డ మృతికి మారుతి కళాశాల యాజమాన్యమే కారణం అని కారుణ్య తల్లిదండ్రులు,బంధువులు తీవ్ర ఆవేదనకు లోనై మాకు న్యాయం చేయండి అని వేడుకున్న వారిని తప్పుడు మార్గంలో వారికి డబ్బు ఎరవేసి వారి నోరులను కట్టి వేశారని తెలిపారు.మీడియా సాక్షిగా వారు మా బిడ్డ మరణానికి మారుతి కళాశాల యాజమాన్యమే అని పలు రకాల వీడియోలు మన ముందు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే బాధితులతో తప్పుడు సాక్షాలను సృష్టించి బయటి సమాజానికి రాత పూర్వకంగా వారి బిడ్డ మరణానికి కళాశాల యాజమాన్యానికి ఏమి సంబంధం లేదని చెప్పించిన తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు పేర్కొన్నారు.బాధిత కుటుంబం క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారని, వారి సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని బాక్స్ లో పెట్టి పూడ్చి పెట్టాలి కాని భవిష్యత్తులో ఎటువంటి సాక్షాధారాలు లభించకుండా డెడ్ బాడీని మారుతి కళాశాల ఒత్తిడి మేరకు మంటల్లో దహనం చేశారని మండిపడ్డారు.బాధిత కుటుంబం తో రహస్య ఒప్పందాలు చేసుకొని వారిని బయటికి రానియకుండా చేసినా జరిగిన సంఘటన అత్యంత దారుణమైనదని భవిష్యత్తులో మరొక విద్యార్థి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోకుండా చర్యలు చేపట్టే విధంగా ఉండడం కోసమే పి డి ఎస్ యు,దళిత సంఘాలు కారుణ్య మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాలు,దళిత సంఘాలు చేసే న్యాయ పోరాటానికి భద్రాచలం పట్టణ ప్రముఖులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ నాయకులు శివాజీ,ఏజెన్సీ దళిత శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్,అనుసూచిత్ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను,కొంచర్ల కుమారి,గద్దల కృష్ణవేణి,ఎస్కే సల్మా,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ,పింగళి నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !