నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (మే 30):
తాడ్వాయి మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు *జంగా సాయిరెడ్డి(80* ) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు.
మృతుడి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రంథాలయ చైర్మన్ *పోరిక గోవింద్ నాయక్, గోవిందరావుపేట జడ్పిటిసి హరిబాబు ప్రదీప్ రావు తాడ్వాయి మండల అధ్యక్షులు దండగుల మల్లయ్య, ముండ్రాతి రాజమౌళి మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నాగక్క, మల్లారెడ్డి* పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయి రెడ్డి మృతి చాలా బాధాకరం అన్నారు
ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వీరి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Post Views: 198