+91 95819 05907

ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు:మంత్రి పొంగులేటి

★పాలేరు నా సొంతిల్లు…. చక్కబెట్టుకునే బాధ్యత నాది

★మూడేళ్లలోపే అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు

★ ఏడాదిలోపు రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా

★ తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రానివ్వను

★ తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్,మే 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లకోసం వచ్చే టైపు కాదు… ఇప్పుడు ఎన్నికలు లేవు… ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. మీ ఆశీస్సులు… దీవెనలతో ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయిన నేను మీ సమస్యలెంటో నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు వచ్చాను. మీరు నాకిప్పుడు ప్రతి వినతిని పరిశీలించి.. వాటిన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కారింపజేసేందుకు కృషిచేస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారాం, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం, ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు తదితర సమస్యల పై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే… పాలేరు నా సొంతిల్లు… చక్కబెట్టుకునే బాధ్యత నాదే…. మీ ఇంటి పెద్దకొడుకుగా నన్ను భావించి… అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి మంత్రిగా నాకు అవకాశం కలిగేలా సహకరించిన మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా అని తెలిపారు… రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ ఇంటి మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడేళ్లలోపే ఇల్లు దక్కేలా చూస్తానని మీకు హామీ ఇస్తున్నా..! అదేవిధంగా ఏడాదిలోపే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా అన్నారు… తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇలా ఏ రకమైన సమస్య వచ్చినా తీర్చే బాధ్యత నాదంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !