పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (మే 31):
ములుగులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రపంచ దేశాలలో అన్నింటిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవమును ప్రతి సంవత్సరం మే 31 రోజున నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి నుండి ర్యాలీని డాక్టర్ అప్పయ్య గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగినది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థిమును ప్రజలలోకి అవగాహన కొరకు పంపించడం జరుగుతుంది అది, ఈ సంవత్సరం థీమ్
“పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం” అని తెలిపినారు.
ఈ అవగాహన ర్యాలీలో వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ప్రతిజ్ఞ
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా, నేను నా జీవితంలో ఏ రకమైన పొగాకు ఉత్పత్తులను ఎప్పుడూ ఉపయోగించనని, లేదా తిననని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులందరినీ పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకూడదని నేను అవగాహన కల్పిస్తానని, పొగాకు ఉత్పత్తుల వాడకం నుండి నా పర్యావరణ రక్షణకు కూడా నేను సహకరిస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. భారతదేశంలో ప్రతి 8 మంది యువకులలో ఒకరు పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో మూడు లక్షల పైచిలుకు మరణాలు కేవలం ఒక పొగాకు ఉత్పత్తులు వాడటం వలన మరణాలు సంభవిస్తున్నాయని who అంచనా ధూమపానం చేయటం వలన పొగ తాగే వారికి కాకుండా చుట్టుపక్కల పరిసరాలు వారికి కూడా ఆరోగ్యానికి హానిచేయునని తెలియజేశారు. పొగాకులో ఉండే నికోటిన్ పదార్థం మెదడుపై పనిచేసి మత్తు బానిస కూలుగా గురి అవుతున్నారని తెలిపారు.
గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే ప్రకారం ధూమపానం పొగాకు వినియోగం మొత్తం 10.38% ఉన్నదని తెలియజేశారు . సిగరెట్ మరియు టొబాకో ప్రోడక్ట్ యాక్ట్ 2003 అమలు కొరకు జిల్లా కలెక్టర్ పోలీస్ వారి సహకారంతో ప్రత్యేక డ్రైవులు నిర్వహించడం జరుగునని తెలిపారు.
ఇందులో భాగంగా ములుగు పట్టణములో స్థానికంగా ఉన్న పాన్ పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగినది.
షాపు యజమానులను పొగాకు గుట్కాలు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది.
ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో బస్టాండ్లో, రైల్వేస్టేషన్లో, సినిమా హాల్లో, మార్కెట్లో, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రదేశాలలో పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు వాడటం లేదా అమ్మకం జరిపిన, ఉల్లంఘించిన వారికి 2000 జరిమానాలతో పాటు జైలు శిక్ష ఉంటుందని మరియు 18 సంవత్సరాలు లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించిన వారిపై జరిమానా విధించబడునని తెలియజేశారు. పొగలేని ధూమపానం ఉదాహరణకు అంబారు, ఖైని, గుట్కా వంటి వాటిని ఇరవై ఒక్క శాతం మంది వాడుతున్నారని, ఇందులో 41% మగవారు మరియు 14% ఆడవారు పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ రవీందర్,
డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్, రాయిని గూడెం వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్, డెమో తిరుపతయ్య, జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్స్ వంగేటి వెంకటేశ్వర్లు ,పి భూపాల్ రెడ్డి, Cho దుర్గారావు,P. సంపత్ రావు, మరియు హెల్త్ ఎడ్యుకేటర్లు సంపత్ ,భాస్కర్, PHC రాయనిగూడెం, MLHPS ఏఎన్ఎమ్స్ ఆశాలు తదితరులు పాల్గొన్నారు..