.
విత్తనాలు కొనే రైతులు అప్రమత్తంగా ఉండాలి..
లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి..
విత్తనాలు కొన్న బిల్లును ,ఖాళీ ప్యాకెట్లను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి..
ఏఓ రామడుగు వాణి..
నేటి గదర్,మే 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో రైతులకు నకిలీ విత్తనాల పై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారిని రామడుగు వాణి మాట్లాడుతూ.. రైతులందరూ విత్తనాలను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుండి మాత్రమే తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలను విక్రయిస్తున్నట్లయితే అటువంటి సమాచారాన్ని వెంటనే మండల వ్యవసాయ అధికారికి లేదా పోలీసు శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్న బిల్లును ఖాళీ ప్యాకెట్లను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా పత్తి గింజలు విత్తుకోవాలంటే తగిన వర్షపాతం అనగా 60 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చిన తర్వాత మాత్రమే పత్తి గింజలను విత్తుకోవాలని లేదంటే భూమిలోని వేడికి గింజలు సరిగా మొలకెత్తవని సూచించారు. అనంతరం పచ్చి రొట్టె ఎరువుల వలన కలిగే ప్రయోజనాలు, వరి పత్తి మిరప సాగులో మెళకువలు, ఎరువుల యజమాన్యం మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి, ఏఈవో వంశికృష్ణ , రైతులు పాల్గొన్నారు.