+91 95819 05907

నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడం ఫాసిస్ట్ చర్య:సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

– అప్రజాస్వామిక చర్యను ఖండించండి
– సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

నేటి గదర్, మే 31, డెస్క్ ప్రతినిధి :

దండకారణ్యంలో “కగార్’ పేరిట మోడీ ప్రభుత్వం సాగించే మారణహోమంపై నిజానిర్ధారణ బృందాన్ని అడ్డుకున్న అప్రజాస్వామిక చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలు ఖండించాలని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఏ.పి. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో ఆదివాసీలని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులని నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసిందని, జనవరి 1 నుండి మారణహోమాన్ని సాగిస్తోందని ఆరోపించారు. అడవి ప్రాంతాన్ని రక్తసిక్తం చేస్తూ, వరసగా బూటకపు ఎదురు కాల్పులకి దిగుతున్నారని, ఈ మారణ హెూమంపై విచారణ కోసం CDRO, పౌరహక్కుల సంఘాలు 52 మందితో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని మే 30న ఛత్తీస్ ఘడ్ దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరారని తెలిపారు. వారిని తెలంగాణ దాటి కుంట మీదుగా వెళ్తుండగా నిన్న 30న కుంట వద్ద CRPF అడ్డుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ గమ్యం స్థానం చేరే లక్ష్యంతో మరో మార్గంలో ప్రయత్నించగా బీజాపూర్ ప్రాంతానికి 40 కి. మీ దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేయగా, పై చర్యకు నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించినట్లు సమాచారం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేంద్రంలోని ఆరెస్సెస్ – బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య మాత్రమే కాకుండా పచ్చి ఫాసిస్టు రాజానీతితో కూడిన చర్యగా కూడా మా పార్టీ భావిస్తున్నామని వెల్లడించారు. అడవి సంపద మౌలికంగా సామాజికమైనది. అడవుల్లో వుండే అపారమైన ఖనిజ సంపద మీద దేశ ప్రజలకు సామూహిక హక్కు ఉన్నదని, అడవుల్లో పుట్టి అక్కడే పెరిగే ఆదివాసులకు సహజ హక్కుదార్లుగా ఉండడంతో పాటు దేశ ప్రజల సమిష్టి వన సంపదకు వారు సెక్యూరిటీ గార్డు పాత్రను కూడా పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఆదివాసీ ప్రాంతాలని బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నెత్తుటి మడుగుగా మార్చే మోడీ సర్కార్ ఫాసిస్టు చర్యని, వివిధ హక్కుల సంఘాలు నియమించిన నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలకు ఖండించాలని వై.సాంబశివరావు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

 Don't Miss this News !