+91 95819 05907

అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం

★శతాధిక ప్రతిష్టాపక సిద్ధాంతి వేల్పుల వీరస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం

★4వ రోజు బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం

★ 2500 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం

★ అలరించిన డప్పు కళాకారులు

★పినపాక కు పోటెత్తిన భక్త జనం

నేటి గద్ధర్ న్యూస్,(పినపాక):

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్

✍️కొత్త దామోదర్ గౌడ్

మండలంలోని పినపాక గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 4 వ రోజు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటి మూడు రోజులు ప్రత్యేక పూజలు చేసి నాలుగవ రోజు వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పినపాక లో శనివారం నిర్వహించిన గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వాడ వాడ నుంచి జనం తరలివచ్చారు. శ్రీ శీతల పరమేశ్వరి నాభిశిల( బొడ్రాయి) విగ్రహాల ప్రతిష్ట ప్రాంతం భక్తజన సంద్రమైంది.

కలష గణపతి పూజ, పుణ్యహవచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజారులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రతిష్టా మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మహి ళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి గ్రామ దేవతల ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి గ్రామస్తుల బంధువులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4వ రోజు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం లో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న ఆయన దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు. ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని. ఊరిలోని వారంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి మహోత్సవ ఉత్సవ కమిటీ, ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !