నేటి గద్ధర్ న్యూస్,జూలూరుపాడు:
జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం హనుమత్ జయంతి వేడుకలను ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పురాణం శ్రీనివాస్ శర్మ ఉదయం 6 గంటల నుండి స్వామివారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు, భక్తులచే ఆకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు 118 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ రామ భక్తులతో పాటు, పరిసర ప్రాంత రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 60