నేటి గద్దర్, వెంకటాపురం :
చొక్కల గ్రామం లో పీసా గ్రామసభ తీర్మానం దుర్గాదేవి సొసైటీకి ఏకగ్రీవంగా తీర్మానం.
గ్రామ సభ ఆమోదం పొందిన తీర్మానం ను ఐటీడీఏకు పంపకుండా ఎంపీడీవో నాలుగు నెలలుగా వాయిదాలు వేస్తున్నారని చొక్కాల గ్రామ ప్రజలు ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం.
ఎంపీడీవో ఆదివాసిల పై ఆదివాసి చట్టాలపై అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూన్నారని ఆదివాసీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామంలో ఇసుక క్వారీ కొరకు పీసా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో దుర్గాదేవి సొసైటీకి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిన సంగతి విధితమే ఈ గ్రామసభ జరిగి నాలుగు నెలలు గడుస్తున్న ఎంపీడీవో వెంకటాపురం కాలయాపన చేస్తూ పలు కారణాలు చూపిస్తూ ఏకగ్రీవంగా దుర్గాదేవి సొసైటీ కి గ్రామ సభ ఆమోదం పొందిన తీర్మానం కాపీలను ప్రోసిడింగ్ను ఐటిడిఏ పిఓ భద్రాచలం కు పంపించుటలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని గ్రామ ప్రజలు ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసా గ్రామసభ ప్రాపర్ గా జరిగిన జరగలేదని, సంబంధిత పై అధికారులకు అనేక అంశాలలో క్లారిటీ లేకుండా సమాచారం ఇవ్వడం ద్వారానే చోక్కాల గ్రామం లో ఆదివాసి ప్రజలకు అన్యాయం జరుగుతుందని భయాందోళనలో ఉన్నారని, న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.