నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 01)
ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాలను పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో విపత్తు నిర్వహణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని చెరువులు , కుంటలు, ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత నీటి నిలువ, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం, కరకట్టల పరిస్థితి ఏవిధంగా ఉంది అనే ప్రాథమిక సర్వే నిర్వహించి పూర్తి వివరాలు అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అప్పలనాయుడు , ములుగు ఈ ఈ నారాయణ , అకులవారి ఘనపురం డి ఈ యశ్వంత్ , భద్రాచలం డి ఈ గోపాల కృష్ణ , ఏ ఈ లు , జె ఏ లు తదితరులు పాల్గొన్నారు…