+91 95819 05907

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ

– ITDA PO ప్రతీక్ జైన్

నేటి గదర్, 02 జూన్, భద్రాద్రి కొత్తగూడెం :

సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణను 29వ రాష్ట్రంగా సాధించుకొని 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి చేరుకోవడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం నాడు ఐటిడిఏ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహం కు పూజలు జరిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్యా, వైద్యం, ఇంజనీరింగ్ వ్యవసాయం, మౌలిక వసతులు సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో తనకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. ఎందరో అమరుల త్యాగాలకు, ఎన్నో సుదీర్ఘ పోరాటాలకు ఫలితంగా అవతరించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏడీఎంహెచ్వో భాస్కర్, ఎస్ ఓ సురేష్ బాబు, హెచ్ ఎన్ టి సి అశోక్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, ఏ సి ఎం.ఓ రమణయ్య, ఏటిడిఓ నరసింహారావు, పవర్ ఏపీఓ మునీర్ పాషా, అగ్రికల్చర్ ఏడి భాస్కర్, మేనేజర్ ఆదినారాయణ, ఐటీడీఏ కార్యాలయం విభాగంలోని అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !