*జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.*
నేటి గదర్ న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 02):
*జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్ పి డా. శబరిష్. పి ఐ పి ఎస్*
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్ గారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. *అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ* :- జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వందలాదిమంది త్యాగాల ఫలితం అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని ప్రజలను కోరారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తున్నామని అన్నారు.జిల్లా అధికారులు మరియు సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం డిఎస్పి రాములు & రవీందర్, తదితరులు పాల్గొన్నారు…