★అక్రమంగా మట్టి తోలుతున్న 5ట్రాక్టర్లు , జేసిబి ని పట్టుకున్న ఎస్ఐ రాజేందర్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:
మండల పరిధిలోని మోతే ఎర్ర చెరువు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తోలుతున్న 5 ట్రాక్టరుల్లు,ఒక్క జేసిబి వాహనాన్ని పట్టుకోని వాటిని పోలిస్ స్టేషను కి పంపించిన కరకగూడెం ఎస్ఐ రాజేందర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మపూరం గ్రామం నుండి కరకగూడెం వైపు తమ సిబ్బందితో వస్తున్న క్రమంలో మోతే చెరువు వద్దనుండి రాత్రి సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తొలకల వద్దకు వెళ్ళి అనుమతి పత్రాలు అడుగగా ఎటువంటి పోంతన లేని సమాధానం తెలపడంతో వాటిని సిజ్ చేసి పోలిస్ స్టేషనుకి తరలించడం జరిగినదని తెలిపారు. ఇక నుండి ఎ వాహన దారులైన బండి వాహన కాగితాలు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ లు ఎప్పుడూ ఎల్లప్పుడూ వెంట పెట్టుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో రైటర్ దుర్గా రావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.