గుడుంబ స్థావరలపై కరకగూడెం పోలీసులు ఉక్కుపాదం.
మండలాన్ని గుడుంబ రహిత మండలంగా చూడటమే ప్రధాన లక్ష్యం: SI రాజేందర్
నేటి గద్దర్ కరకగూడెం:
మండల మండల కేంద్రంలోని కలవల నాగారం అటవీ ప్రాంతంలో గల కౌలూరు గ్రామ అటవీ ప్రాంతంలో సూమారు 500 లీటర్ల బెల్లం పానకం కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలసి ధ్వంసం చేశారు. అటవీ ప్రాంతంలో తన సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించగా గుండుంబ తయారీ కోసం ప్లాస్టిక్ డ్రబులలో నిల్వచేసిన సూమరు 500 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఏ గ్రామంలో అయినా గుడుంబా తయారీ గాని అమ్మకంగానే జరుగుతే ప్రజలు నేరుగా తనకు సమాచారం తెలపగలరని అన్నారు. గుడుంబా తాగి చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దయానియంగా మారుతున్నాయని తెలిపారు. కరకగూడెం మండలాన్ని గుడుంబా నియంత్రణ మండలంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.