★ పాలిటెక్నిక్ టెక్నిక్ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ చాటిన ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థులు సుశాంత్, రాంచరణ్
★ రాష్ట్ర స్థాయిలో ఎంట్రన్స్ పరీక్ష లో స్టేట్ ఐదవ ర్యాంక్ సాధించిన ఎక్సెలెంట్ విద్యార్థి సుశాంత్
★ రాష్ట్ర స్థాయిలో 5వ,722 వ ర్యాంకులను సొంతం చేసుకున్న ఎక్సెలెంట్ ఇద్దరు విద్యార్థులు
నేటి గద్ధర్ న్యూస్ ,పినపాక,( జూన్ 3),
విద్యార్థుల ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న పాలిసెట్ 2024
జూన్ 3న ఫలితాలు విడుదలయ్యాయి.. జూన్ 3న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ ఫలితాలు అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పినపాక మండలం లో గల ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థి ఉప్పాక గ్రామానికి చెందిన సుశాంత్, రాజుపేట గ్రామానికి చెందిన మరొక విద్యార్థి ఎన్ రాంచరణ్ రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ చాటి ఐదవ ర్యాంక్ అంతే కాకుండా రాష్ట్ర స్థాయిలో మరొక విద్యార్థి 772 ర్యాంక్ సాధించారు.ఈ సందర్బంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో వరుసగాఎక్సెలెంట్ బాషా హై స్కూల్ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటున్నది అని, ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థులకు కాన్సెప్ట్ ఆధారంగా పాఠాలు బోదిస్తారని డైరెక్టర్ బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ సంయుక్త ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులను సత్కరించారు.. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషం గా ఉందని, ఇందుకు గాను నాకు సహకరించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండీ యూసఫ్ షరీఫ్, కరస్పాండెంట్ ఎండీ ఖాదర్, డైరెక్టర్స్ ఎండీ యాకుబ్ షరీఫ్, ముక్కు నర్సారెడ్డి, బండారు నరేంద్ర ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు