నేటి గద్ధర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి :
AP లో టీడీపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఖమ్మంలో టి. టిడిపి నేతలు సంబరాలు చేసుకున్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న సంబరాల్లో తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన తుమ్మలకు టీడీపీ నేతలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి తుమ్మల రాకతో టిడిపి శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
Post Views: 114