నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభం అయింది. ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరుపున తీన్మార్ మల్లన్న, బి ఆర్ స్ తరుపున రాకేష్ రెడ్డి,బి జె పి తరుపున ప్రేమిందర్ రెడ్డి, అశోక్ స్వతంత్ర అభ్యర్థి గా ఉన్నారు. నిన్నటి లోకసభ ఫలితాలలో కాంగ్రెస్, బీజేపీ సమాన సీట్ల సాధించగా. పట్టభద్రుల ఎన్నికలు ఎవరిని వారిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
నేడు నల్గొండ. ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు..
ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి.
నల్గొండ సమీపంలోని ఆనిశెట్టి దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడౌన్స్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్..
రౌండ్ దీ క్లాక్ 24 గంటల పాటు కౌటింగ్ .
మెదటి రౌండ్ లో బండిల్స్ కట్టే ప్రక్రియ.
రెండో రౌండ్ లో చెల్లుబాటు అయిన ఓట్లను,చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ.
చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే విజేత.
అభ్యర్దులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌటింగ్.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం మూడు రోజుల పాటు కౌంటింగ్ జరిగే ఆస్కారం..
4 హాల్స్ లలో , మెత్తం 96 టేబుల్స్ ఏర్పాటు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపే లెక్కింపు..
24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని నియామకం..