+91 95819 05907

కుంటుపడిన మణుగూరు మున్సిపాలిటీ.

పేరు గొప్ప ఊరు దిబ్బలా మున్సిపాలిటి…

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 5 :
నైనారపు నాగేశ్వరరావు ✍️
789 353 8668.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణం మణుగూరు, పేరుకు పెద్దదే గాని పట్టణంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దర్శన మిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. మణుగూరు పురపాలకానికి 17 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని స్థానిక ప్రజలు కోడై కూస్తున్నారు.మణుగూరు మున్సిపాలిటీ పై ప్రభుత్వం చొరవ చూపాలని పుర ప్రముఖులు కోరుతున్నారు. మణుగూరు పురపాలకంలో సుమారుగా 20 వార్డులు ఉన్నాయి.పట్టణ జనాభా 50 వేల మంది ప్రజలకు పై చిలుకు నివసిస్తున్నారు. అధికారుల పాలన కొనసాగుతుండడంతో పట్టణంలో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది.పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని,ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు మూలన పడ్డాయని, వాటికి మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదని,దీంతో అవి త్రుప్పు పడుతున్నాయని ప్రజలు మండి పడుతున్నారు.మణుగూరు పాలకమండలి లేకపోవడంతో మునిసిపల్ అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.వచ్చిన కమిషన్లతో మునిసిపాలిటీ అధికారులు ఇష్టానుసారంగా దండుకుంటున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.ఇంటి పన్నులు ఇష్టానురీతిలో పెంచుతూ,పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీకి పాలకవర్గం లేక పోవడంతో మున్సిపల్ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పేరు గొప్ప ఊరు దిబ్బలా మణుగూరు…

మణుగూరు మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని ప్రజలు ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయవాదులు ఆరోపిస్తున్నారు.ఒక్కసారి కూడా చెత్త వాహనాలు రావడం లేదని మణుగూరు పట్టణం సుందరయ్య నగర్ ఏరియాలో సైడ్ డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి మురికి వాసన దోమలతో రోగాల బారీన ప్రజలు పడుతున్నారని,ప్రజలని పట్టించుకోవడం లేదని మణుగూరు మున్సిపాలిటీలో కమీషనర్ ఉన్నాడా లేడా అని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.కేవలం ఇంటి పన్నుల కోసమే వస్తారని మున్సిపాలిటీ ప్రజలు మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వర్షం పడితే ఇండ్లు మొత్తం ముంపుకు గురవుతున్నాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు రాకముందే డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను శుభ్రం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణ అభివృద్ధి కుంటుపడిందని పట్టణ పురపాలకకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !