నేటి గద్ధర్ న్యూస్,పినపాక:
మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని SBI మణుగూరు బ్రాంచ్ సీనియర్ మెసెంజర్ గీదె మోహన్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన పినపాక మండలం పోతురెడ్డి పల్లి గ్రామంలో ని ఆయన స్వగృహంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భావి తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తన చిన్నతనంలో గ్రామాల్లో పెద్దపెద్ద వృక్షా లు, పచ్చని మొక్కలతో వాతావరణ సమత్యులత ఉండేదన్నారు. దీంతో కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొనేదని చెప్పారు. కానీ మారిన పరిస్థితుల్లో మొక్కలను తొలగించడంతో పచ్చదనం తగ్గిపోయి వేసవిలో వానలు, చలికాలంలో ఎండకొట్టడం లాంటి మార్పులు కనిపిస్తున్నాయన్నారు.వృక్షోరక్షతి రక్షిత అని మనం మొకలు నాటి సంరక్షిస్తే అవి మనల్ని, భావి తరాలను సంరక్షిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలని పిలిపించారు