బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదు…
మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అమరావతి,జూన్ 05:
నైనారపు నాగేశ్వరరావు ✍️
789 353 8668
సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిచినప్పటికీ,మెజారిటీ గతం కంటే తగ్గింది. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేకుండా పోయింది.ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వస్తోంది.ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీయే కూటమిలో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవకాశం ఉంది.దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా బ్లాక్‌గా రాజకీయ పార్టీలు అన్ని విడిపోయాయి. రెండు భారీ క్యాంపుల మధ్య హోరా హోరీ పోరు సాగింది.ఎన్డీయేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.బీజేపీ తర్వాత తెలుగుదేశం మినహా మరే పార్టీకి అన్ని సీట్లలో విజయం సాధించలేదు.ఏపీలో ఎన్డీయే 21 స్థానాల్లో గెలుపొందగా,తెలుగు దేశం పార్టీ సింగిల్‌గా 16 సీట్లు సాధించుకుంది.ఈ బిగ్ నంబర్‌తో ఎన్డీయే లో మోడీ తర్వాత చంద్రబాబు కీలకం అయ్యారు.బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సరిపడా అన్ని అవకాశాలు చంద్రబాబుకు ఉన్నాయి.ఎన్డీయే కూటమికి టైట్ మార్జిన్ రావడంతో బాబు పాత్ర అత్యంత కీలకంగా మారింది.ఇండియా కూటమిలోని మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదు.తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడే చంద్రబాబు నాయుడు అంటూ మేధావి వర్గంలో చర్చలు జరుగుతున్నాయి.
మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు.
కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ,రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది.ఎన్నో రాజకీయ మార్పులను చూశాను.ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం అంటున్న చంద్రబాబు నాయుడు.ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నట్లుగా విశ్వాసనీయ సమాచారం.