NDA ప్రభుత్వ కూటమి ఏర్పాటు లో కీలకంగా మారిన టిడిపి…
కేంద్ర క్యాబినేట్ లో 4 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని డిమాండ్…
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి:
(ఆంధ్ర ప్రదేశ్) జూన్ 5:
ఎన్ డి ఏ ప్రభుత్వ కూటమి ఏర్పాటు లో టిడిపి కీలకంగా మారింది.కేంద్ర క్యాబినేట్ లో 4 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో టిడిపి 16 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఈ 16 ఎంపీ సీట్లు తో బిజెపి తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా టిడిపి మారింది. ఈ సందర్భంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే టిడిపి మద్దతు అనివార్యమైనది. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకొని బిజెపి కేంద్ర క్యాబినెట్ లోకి 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆ శాఖల వివరాల్లోకి వెళితే,లోక్ సభ స్పీకర్, రవాణా శాఖ,వ్యవసాయ శాఖ,జలశక్తి శాఖ,గ్రామీణ అభివృద్ధి శాఖ,హెల్త్ శాఖల్లో 4 మంత్రి పదవులను ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం.ఈరోజు సాయంత్రం జరగనున్న ఎన్ డి ఏ కూటమి సమావేశంలో అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది.