ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్…
సిపిఎం చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి (చర్ల) జూన్ 5:
చర్ల మండలంలోని ప్రజలు డెంగ్యూ జ్వరాలతో మృత్యువాత పడుతున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో తక్షణమే ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలని,సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏజెన్సీ పల్లెల్లో ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని,మెరుగైన వైద్యం అందించాలని కోరారు.చర్ల మండల కేంద్రంలోని మొగలపల్లి గ్రామపంచాయతీలోని ఆనంద్ కాలనీ గ్రామంలో అనేక మంది విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ లోని ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సత్యనారాయణపురం గ్రామపంచాయతీలోని ప్రజలు కూడా డెంగ్యూ జ్వరాలతో నానా అగచాట్లు పడుతున్నారని అన్నారు.పెద్దపల్లి ప్రజలు కూడా విష జ్వరాలతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రైవేటు వైద్యం కోసం పట్టణాలకు పరిగెడుతున్నారని ఆవేదన వ్యక్తం.కొత్త పెళ్లి గ్రామంలో చిన్న ముసిలేరు గ్రామంలో కనీసం 25 సంవత్సరాల వయసు పూర్తికాని యువకులు చర్ల ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందక దగ్గర్లో ఉన్న భద్రాచలం పట్టణ కేంద్రానికి వెళ్లి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కొరకు లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం పొందిన ఈ ప్రాంతంలోని గిరిజన బిడ్డ ప్రాణాలు దక్కలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.చనిపోయిన గిరిజన,దళిత కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని,చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇకనైనా చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలుగా తీర్చిదిద్ది సీనియర్ డాక్టర్లను నియామకం చేపట్టి ఈ మూడు ప్రభుత్వ వైద్యశాలల నందు పూర్తిస్థాయి సీనియర్ వైద్య సిబ్బందిని నియమించి,అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించి ఏజెన్సీలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు.