నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 5:
ఐసిడిఎస్ మణుగూరు సెక్టార్ ఆధ్వర్యంలో అన్నారం,బెస్తగూడెం అంగన్ వాడి కేంద్రాల నందు బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లు మాట్లాడుతూ,3 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్ వాడి కేంద్రంలో చేర్పించాలని వారు కోరారు.ఫ్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో నైపుణ్యత పెరుగుతుందన్నారు.చిన్నారుల తల్లిదండ్రులకు ఫ్రీ స్కూల్ సిలబస్,టైం టేబుల్,వర్క్ బుక్స్,ఫ్రీ స్కూల్ కిట్, మెటీరియల్ అందించడం జరుగుతుందని వివరించారు.వాటి వలన పిల్లల్లో శారీరకంగా,మానసికంగా,ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం,గుడ్డు,పాలు,పప్పు,ఆకుకూరలతో భోజనం అందిస్తున్నట్లుగా తెలిపారు.5 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలను ప్రాథమిక పాఠశాలలో జాయినింగ్ చేయాలని కోరారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు సిహెచ్ కళావతి,బి శ్రావణి మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.