నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 06):
అఖినేపల్లిమల్లారం (మంగపేట ) ఈ రోజు మంగపేట మండలం లోని 25 గ్రామ పంచాయతీ లో గల 49 PESA గ్రామ సభల అభివృద్ధి కి PESA కమిటీలు పనిచేయాలని కొమురం ప్రభాకర్ కోరారు.PESA కమిటీ ములుగు జిల్లా అధ్యక్షులు డబ్బుల ముత్యాలరావు అధ్యక్షతన ఈ సమావేశం అఖినేపల్లి మల్లారం లో నిర్వహించడం జరిగిందన్నారు. గిరిజన గ్రామాలలో గల వనరులను ఉపయోగించుకొని ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను గ్రామ సభల ద్వారా గిరిజనులకు దరిచేరే విధంగా PESA కమిటీలు పనిచేయాలన్నారు. గ్రామాలలో గల కుల పెద్దలు, యువకులు, డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు PESA గ్రామ సభలు భలోపేతం చేయుటకు కృషి చేయాలన్నారు. ప్రతి PESA మొబిలైజర్ వద్ద గ్రామం, గ్రామ పంచాయతీ కి సంబందించిన సమాచారం ( జనాభా, వృద్దులు, , వ్యవసాయం) ఉండాలన్నారు. ఏజెన్సీ గ్రామాలలో ఒక ప్రాజెక్టు కట్టాలన్న PESA గ్రామ సభలను సంప్రదించాలని చట్టం లో పొందు పర్చబడ్డదన్నారు. 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం -2006, షెడ్యూల్డ్ ప్రాంత పాలన – రాజ్యాంగ నియమాల గురించి PESA కమిటీలకు అవగాహన చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో ఆదివాసీ హక్కుల ఉద్యమ కర్త గొప్ప వీరయ్య, PESA కమిటీ జిల్లా అధ్యక్షులు డబ్బుల ముత్యాల రావు, ఆదివాసీ కుల పెద్దలు బండ్ల ముత్యాపూరావు, అప్పినబోయిన నర్సింహామూర్తి మాజీ సర్పంచ్, గొప్ప చంద్రకాంత్,25 గ్రామ పంచాయతీ ల మొబిలైజర్లు, 49 గ్రామ సభల ఉపాధ్యక్షులు/ కార్యదర్షులు పూసం కార్తీక్, జోగ నరేంద్ర, తాటి విజయ్, జీగట శ్రీను, ఏటూరునాగారం PESA కమిటీ అధ్యక్షులు పాయం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.









