సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 6:
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో 14 & 16 డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని లారీ డ్రైవర్లను ఉద్దేశించి CITU జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ మాట్లాడుతూ,లారీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో లారీ అసోసియేషన్ ముందుకు రావాలని రోజుకు 1200 రూపాయలు జీతం,ట్రిప్పు మామూలు 160 రూపాయలు ఇవ్వాలని కార్మికుల ఆందోళన చేస్తున్నారని,లారీ డ్రైవర్ అసోసియేషన్ ఓనర్స్ అసోసియేషన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తక్షణమే అగ్రిమెంట్ చేయాలని కార్మికుల ఆందోళన చేస్తున్నారని వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సమ్మెలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, లారీడైవర్స ప్రెసిడెంట్ సప్క శ్యామ్, కార్యదర్శి సతీష్, ఉపాధ్యక్షులు నెట్టెం కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు యామంకి సాంబయ్య,సహాయ కార్యదర్శి వెంకన్న,ట్రెజరర్ మచ్చ ముత్తయ్య,జి సతీష్, కొమ్ము రవి,శ్రీను వేణు, వెంకటేశ్వర్లు, కాలవ ప్రసాద్, రాంబాబు, జగదీష్ నాగరాజు,సిద్దిపాక కళ్యాణ్,డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.