నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు (జూన్ 06)
ఓసి-2 నూతన కార్యాలయం మరియు కే పి యు జి ప్రధాన రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి వరద నీరు మళ్లించాలి లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనీ కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మణుగూరు ఏరియా ఇన్ చార్జ్ జిఎం తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ గారికి వినతి పత్రం అందజేసినట్లు గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీకే ఓ సి సెక్షన్-2 నూతన క్షేత్ర కార్యాలయం (సైట్ ఆఫీస్)కొండాపురం భూగర్భ గని మరియు దుర్గా-2 ఓబీ కంపెనీ కి వెళ్లే ప్రధాన రహదారి కి సంబంధించి మార్గమధ్యంలో ఏరియా వర్క్ షాప్ సమీపంలో సింగరేణి రైల్వే అండర్ బ్రిడ్జి నుండి కార్మికులు అధికారులు ఇతరులు కూడా ప్రయాణించాల్సి ఉందనీ వర్షాకాలంలో ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నుండి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించే కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, జూన్ రెండవ తేదీ రాత్రి భారీ వర్షానికి కూడా ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు, వర్షం తగ్గిన తర్వాత మార్గమంతా బురద మాయం అవుతుందని మండల పరిధిలోని గిరిజన గ్రామాలైన బుగ్గ ఖమ్మం తోగు, బుడుగుల ప్రజలు కూడా ఈ బ్రిడ్జి కింద నుంచి ప్రయాణిస్తున్నారన్నారు,ఈ నేపద్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి నుండి వరద నీరు మళ్లింపుకు చర్యలు చేపట్టడమా లేక ప్రత్యామ్నాయంగా కొండాపురం సి ఎస్ పి నుండి, అవకాశం ఉంటే కూనవరం రైల్వే గేట్ పక్కనుండి నూతన రోడ్డు నిర్మాణం చేసి ప్రయాణించే విధంగా దారి మళ్లించడమా అనే అంశంపై మణుగూరు ఏరియా సింగరేణి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు, ఇన్ ఛార్జ్ జిఎం లక్ష్మీపతి గౌడ్ గారు సానుకూలంగా స్పందించారని త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని తెలిపారున్నారు ఈ కార్యక్రమంలో ఏ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.