◆బాధిత కుటుంబాలను పరామర్శించిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ
నేటి గద్దర్ కరకగూడెం: మండలంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తాటిగూడెం, పద్మాపురం చొప్పాలా కొత్తగూడెం గ్రామా పంచాయితీలలో నిన్న ఉరుములు గాలి దుమ్ముతో కురిసిన వర్షానికి కూలిపోయిన ఇల్లుల పైకప్పులను పరిశీలించారు,అనంతరం కొత్తగూడెం గ్రామంలో ఇర్ప రామారావు,మంకిడి బాబు, మంకిడి నారాయణ అనే రైతులకు చెందిన 3 దుక్కిటి ఎడ్లు పిడుగు పడి మృతి చెందడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎవరు అధైర్య పడొద్దు అని వారికి జరిగిన నష్టానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో
మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు,
మండల నాయకులు కోర్స బుచ్చయ్య,ఏళ్ళబోయిన బుచ్చయ్య, ఏళ్లబోయిన సత్యం, తొలేం అప్పారావు,పడిగా సమ్మయ్య, ఘందార్ల రామనాధం, కృష్ణ, దొంతూ మల్లయ్య,కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
