.
నేటి గద్దర్ కరకగూడెం:
మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతి అంగేరుగూడెం గ్రామంలో అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్ రవీంద్ర, ప్రైమరీ స్కూల్ టీచర్ తిరుమల రావు మాట్లాడుతూ మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఆమె అన్నారు.ప్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా పిల్లలో నైపుణ్యం పెరుగుతుందన్నారు.5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రైమరీ స్కూల్ జాయిన్ చేయించాలని ప్రైమరీ స్కూల్ టీచర్ తిరుమలరావు పిల్లల తల్లీ దండ్రులను కోరారు,ఈ కార్యక్రమం లో విద్యార్థులువారి తల్లీ దండ్రులు,గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 89