నేటి గద్ధర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం కలెక్టర్ వి. పి గౌతమ్ కొణిజర్ల మండలంలోని ప్రాధమిక పాఠశాలలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మపాలెం, బస్వాపురం పాఠశాలను కలెక్టర్ సందర్శించరు. పాఠశాలలో జరిగే పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటి వరుకు జరిగిన పని ఏమిటి, ఇంకా ఎంత వరకు పని ఉంది,అని వివరాలు సేకరించరు. పనిలో నాణ్యత కనిపించాలని కోరారు.పనులను వేగవంతం చేయాలని , పాఠశాలలు ప్రారంభించే సమయానికి అన్ని పనులు పూర్తి కావాలని చెప్పారు.ఇంత వరకు నిధులు మంజూరు ఎన్ని అయినాయి, అడ్వాన్స్ ఎంత అందింది అనే విషయాలును సైతం కలెక్టర్ అరా తీశారు.
Post Views: 52