నిషేధిత విత్తనాల అమ్మితే కఠిన చర్యలు తప్పవు.
★ మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ
★విత్తన డీలర్లతో సమావేశం
నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని భట్టుపల్లి రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ విత్తన,ఎరువుల, పురుగు మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
డీలర్లకు కొని అంశాలను సూచించేవారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి.విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను, ఎమ్మార్పీ ధరకు మించి అధిక ధరలకు అమ్మకూడదు.రైతులకు విధిగా రసీదులు ఇవ్వాలి.బిల్లుపై ఖచ్చితంగా రైతు సంతకం తీసుకోవాలి.ప్రతీరోజు విత్తన విక్రయాలను రైతు వారీగా నమోదు చేసి వ్యవసాయ శాఖ వారికి అందజేయాలి.కాలం చెల్లిన విత్తనాలు కానీ సర్టిఫికేషన్ లేని విత్తనాలను కానీ ఎట్టి పరిస్థితిలో రైతులకు అమ్మరాదు.రైతుకు నచ్చిన విత్తనాలు మాత్రమే అందజేయాలి అని సూచించారు.విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు సరైన అవగాహన కలిగి ఉండాలి తద్వారా భవిష్యత్తులో జరిగే పంట నష్టాలకు తగిన పరిహారాన్ని పొందవచ్చు.వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన ఆదికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి విక్రయించే నకిలీ విక్రయిదారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదు. బిజి-3 పేరుతో చలామణి అవుతున్న హెచ్ టి పత్తి విత్తనాలకు జి ఈ ఏ సి ( జి ఏ ఏ సి) అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం, సాగు చేయడం నేరము.నిర్ణీత ఫార్మాట్ లో ఉన్న బిల్లు (రసీదు) అనగా దుకాణదారుని అడ్రస్ పేరు సీడ్ లైసెన్స్ నంబరు జిఎస్టి నంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే రసీదుగా అంగీకరించాలి
కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి రసీదు పై విత్తన కంపెనీ పేరు విత్తన రకంపేరు, లాట్ నెంబరు,గడువు తేదీ మరియు డీలర్ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.లూజుగా ఉన్న సంచులు, పగిలిన పాకెట్లు డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనరాదు.
కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్ సంచి డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. విత్తన పాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలి.
బీటీ కాటన్ విత్తన ప్యాకెట్లపై జి ఈ ఏసి అప్రూవల్ నెంబర్ తేదీ, సదరన్ జోన్ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన పాకెట్ పై ఉన్న సమాచారంలో సరి చూసుకోవాలి.విత్తన ప్యాకెట్ను బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవడం తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు అనిల్ ప్రశాంత్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
