◆రైతుల కోసం మీ పార్టీ ఎందుకు ఏమీ చేయడం లేదు?
★BJP ఎంపీ కంగనా ను ప్రశ్నించిన CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్
నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్: భారత రైతుల పట్ల అమర్యాదగా మాట్లాడిన ఓ Mp ని సి ఆర్ పి ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించింది.వివరాలు ఇలా ఉన్నాయి.
చండీగఢ్ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం 3:40 గంటలకు కంగనాను CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కంగనా రనౌత్ చండీగఢ్ నుండి ముంబైకి షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చెక్ ఇన్ చేస్తున్నప్పుడు, అక్కడ సిఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్న లేడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను మేడమ్, మీరు బీజేపీ నుండి గెలిచారా అని అడిగారు. దానికి ఆమె అవునని చెప్పగా రైతుల కోసం మీ పార్టీ ఎందుకు ఏమీ చేయడం లేదు? అని ప్రశ్నించగా దీనిపై చర్చ జరిగింది. ఆ తర్వాత మహిళా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చెంప మీద కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ అభ్యర్థి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విజయం సాధించారు.