– దేపంగి రమణయ్య మాదిగ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు
నేటి గద్దర్, జూన్ 07, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
జూలై 7 న MRPS 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రావిటీ స్కూల్లో మెంతిన ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన MRPS, MSP అనుబంధ సంఘాల జిల్లా సమావేశంలో MSP జిల్లా అధ్యక్షులు దేపంగి రమణయ్య మాదిగ మాట్లాడుతూ… వరంగల్ లో జరిగే ఈ ఆత్మగౌరవ కవాతు మాదిగల ఆత్మగౌరవనికి ప్రతీకగా ప్రతి ఒక మాదిగ చూడాలని, లక్షలాది మంది మాదిగలు ఈ కవాతుకు హాజరై విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. MSP, MRPS అన్ని అనుబంధ సంఘాల జిల్లా నాయకత్వం గ్రామ గ్రామాన తిరిగి MSP, MRPS, MSF, MEF, MYS, VHPS, MJF, MLF, MKM నూతన కమిటీలు నిర్మాణం చేసి, జెండా గద్దెలు నిర్మాణం చేసి మాదిగలను ఏకం చేసి మాదిగల, మహాజనులతో డ్రెస్ కోడ్ తో కవాతుకు సన్నహద్ధం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో MSP జిల్లా సీనియర్ నాయకులు నల్లగట్ల వెంకన్న మాదిగ, జినక ఇస్తారి మాదిగ, బోయ జగన్నాథ మాదిగ, కొత్తపల్లి సోమయ్య మాదిగ, మెంతిన వసంతరావు మాదిగ, జిల్లా కార్యనిర్వాహణ అధ్యక్షులు ఇసంపల్లి కృష్ణ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా మాదిగ పెరియార్, ప్రధాన కార్యదర్శి చెంగల గురునాధం మాదిగ, ఉపాధ్యక్షులు కొమ్ము హుస్సేన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.