నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి గా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.ప్రపంచ ఆహార దినోత్సవం సందర్బంగా మంత్రి తుమ్మల ఆహార భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండ చూడాలని అధికారులను అయన కోరారు. ఆహార భద్రత నిల్వలు సక్రమంగా చూసి అందరికి ఆహారం అందించటం తన లక్ష్యం అని అన్నారు. ప్రతీ పేదవాడు కడుపునిండా అన్నం తినాలి అనేదే తన సంకల్పం అని చెప్పారు. ఆకలితో ఎవరు బాధపడవద్ధని రేషన్ కార్డు ఉన్న ప్రతీ పేదవారికి బియ్యం అందించాలని తెలిపారు. రానున్న రోజులలో వరి ఉత్పత్తిని ఇంకా పెంచి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా చూడాలని అధికారులను కోరారు.
Post Views: 38