★8 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి
★22 గిరిజన, గిరిజనేతర గ్రామాలను అభివ్రుద్ది చెయ్యాలి*
★గత ప్రభుత్వాలు మాట ఇచ్చి మోసం చేశాయి
★రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని నమ్ముతున్నాం
★లేనియెడల ప్రజాపంధా ప్రజలను పోరుకు సిద్ధం చేస్తుంది సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది
★వద్దిపేట లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ సాధన కోసం జరిగే పోరుకు ప్రజలు సంసిద్ధులు కావాలి
*CPIML మాస్ లైన్(ప్రజాపంధా) పార్టీ డివిజన్ నాయకులు కొండా
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
చర్ల మండలంలో ఉసుగుప్ప పంచాయతీ పరిధిలో గల వద్దిపేట చెక్ డాం నిర్మిస్తామని లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తామని గత ప్రభుత్వాలు ప్రజలను నమ్మబలికి ఓట్లు వేయించుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని సమస్యని ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటూ ఏళ్ల తరబడి కాలం వెళ్ళబుచ్చారు తూతూ మంత్రపు సర్వేలు జరిపి ప్రజలని తప్పు దోవ పట్టించారు పలు బహిరంగ సభల్లో శంకుస్థాపన చేస్తామంటూ ప్రజల బాలు పలికి వారు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు ఇప్పటివరకు ఏదైనా గత ప్రభుత్వాలు వదిపేట చెక్ డ్యాం ను ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని ఇది అత్యంత దారుణం అని విమర్శించారు చెక్ డాం నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కావడం లేదని కొన్ని రోజులు చెప్పుకొచ్చారు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం సాధ్యమవుతుందని కొన్ని రోజులు చెప్పుకొచ్చారు కానీ ఏ చిన్న పని కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు ప్రజల పట్ల గత ప్రభుత్వాలకు ఉన్న ప్రేమకు ఈ నిర్లక్ష్యం నిదర్శనం అని అన్నారు వాస్తవానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం జరిపితే 22 గ్రామాలకు చెందిన గిరిజన గిరిజన ఇతరలకు చెందిన 8 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని ఈ గ్రామాలలోని రైతులు ప్రజలు కూలీలు అభివృద్ధిలోకి వస్తారని అన్నారు సాగునీటి వస్తే లేని కారణంగా ప్రతి ఏడు పంట ప్రకృతి వైపరీత్యాలకు ఎండిపోతుందని అన్నారు చర్ల మండలంలో ఎక్కువ శాతం పాల్ పేరు ప్రాజెక్టు కాలువలకు ఎగువ భాగంలో ఉండడం వల్ల ఎటువంటి నీటి వసతులు వులు లేవని అన్నారు మండలంలో లెనిన్ కాలనీ పాత చర్ల పూజారి గూడెం మల్లారం సింగసముద్రం ఉప్పరిగుడం గన్నవరం కాలనీ రేగుంట కత్తి గూడెం కొయ్యూరు కొయ్యూరు చీమలపాడు సుందరయ్య కాలనీ గొల్లగూడెం సుబ్బంపేట తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలు రైతులు వర్షాధారం పైనే పంటలు పండిస్తున్నారని అన్నారు గతంలో తాళి పేరు జలాల సాధన కమిటీ మరియు వద్ది పేట చెక్ డాం నిర్మాణ సాధన కమిటీ ల ఆధ్వర్యంలో అనేక దఫాలుగా పోరాటాలు వినతి పత్రాలు ప్రజలు రైతులు స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో అందిం చరాని అన్నారు దాని ఫలితంగా చెక్ డాం నిర్మించాలని ప్రతిపాదన కూడా నాడు జరిగిందని అన్నారు అయినప్పటికీ ఆ ప్రతిపాదన కాగితాలు మగ్గుతుంది తప్ప కార్యచరణకు దాల్చడం లేదని వాపోయారు గత ప్రభుత్వాల వద్ద చర్ల మండలంలోని 22 గ్రామాల ప్రజలు మోసపోయారని ఇప్పుడున్న ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి గారిపై ప్రజా ప్రభుత్వం పై నమ్మకం ఉందని కాబట్టి ఈ ప్రభుత్వంలోనన్నా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 22 గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం ఏడు ఎనిమిది వేల ఎకరాల భూమి సాగులోకి రావడం కోసం వద్దుపేట గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ని ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు లేనియెడల ప్రజాపంధా ప్రజలను పోరుకు సిద్ధం చేస్తుందనీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందనీ వద్దిపేట లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ సాధన కోసం జరిగే పోరుకు 22 గ్రామాల ప్రజలు రైతులు యువకులు విద్యార్థులు మేదావులు సంసిద్ధులు కావాలనీ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు పాలెం చుక్కయ్య , సిమిడి సుజాత, పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ పార్టీ మండల నాయకులకు పూజారి సామ్రాజ్యం, మెహమద , చెన్నాం మోహన్ తదితరులు పాల్గొన్నారు